Sunday, May 19, 2024

కాంగ్రెస్, టీడీపీ హయాంలో అభివృద్ధి జరుగలేదు

spot_img

సీఎం హోదాలో రేవంత్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయన్నారు. గతంలో ముంబైకి బస్సులు వేయాలని ధర్నాలు చేసే వారు..మా పదేళ్ళ లో ముంబైకి బస్ లు కావాలని ధర్నా చేయలేదన్నారు.ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడి ఆయన..పాలమూరు అభివృద్ధి పై మాట్లాడితే బాగుంటుంది.. అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డురం. ఏపీలో పాలమూరు బాగుందా..రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అభివృద్ధి జరిగిందా చెప్పాలి. కాంగ్రెస్, టీడీపీ హయాంలో  ఎలాంటి అభివృద్ధి జరుగలేదు. కల్వకుర్తి లిఫ్ట్ పథకంతో నీళ్లు ఇవ్వలేదా..ఆత్మసాక్షిగా చెప్పండి. కేసీఆర్ ఒక్క ఓటమిపై ఇన్ని అభాండాలా. కేసీఆర్ పాలమూరు ఎంపీగా ఉన్నాడు గనుకే తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ వాదాన్ని కప్పి పుచ్చుకునేందుకు శిలా ఫలకాలు వేశారు. చంద్ర బాబు పాలమూరు ను దత్తత తీసుకున్నపుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా ..కేసీఆర్ హయం లో జరిగిందా అని ప్రశ్నించారు.

తెలంగాణ వచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని అన్నారు శ్రీనివాస్ గౌడ్. జిల్లా నుంచి సీఎం అయినందుకు జిల్లా అభివృద్ధి పై దృష్టి పెట్టండి. కాళేశ్వరం పరిశీలించిన మీరు..పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించండి. మేము కుడా వచ్చేoదుకు సిద్ధం. కొడంగల్ ఎత్తి పోతలపై పునరాలోచించండి. జూరాల నుంచి నీటి తరలింపు సాధ్యమేనా ఆలోచించండి. కర్ణాటక కొత్త ఎత్తి పోతల పథకాలను ప్రారంభిస్తే జూరాలకు నీరు అందే పరిస్థితి లేదన్నారు.15 శాతం పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. పాలమూరు ప్రాజెక్టు ను నాలుగైదు నెలల్లో పూర్తి చేయవచ్చు. ఇంజనీరింగ్ అధికారులతో ఒక సారి సమీక్షించుకోండని సూచించారు. నీళ్లు ఇచ్చిన ఘనత మాదే అని చెప్పుకోండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటి అన్నదానిపై పునరాలోచించాలన్నారు శ్రీనివాస్ గౌడ్.

కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు ముసళ్ళ పండగేనని అన్నారు శ్రీనివాస్ గౌడ్. మేము ఎంతో చేసినా.. ప్రజలు ఇంకా ఎక్కువ కోరుకున్నారు. అందుకే మీకు అవకాశం వచ్చింది. బీజేపీతో పొత్తు ఉంటే రాష్ట్ర నేతలతో ఉంటుందా .మేము కూడా వాళ్లలా చెప్పుతో కొడతాం అనవచ్చు. రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరం.పాలమూరు లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై పోటీ చేయలేదా..మాకు పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: సీఎంగా ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదు

Latest News

More Articles