Monday, May 6, 2024

సీఎంగా ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదు

spot_img

సీఎంగా ఎన్ని రోజులు అధికారంలో ఉంటాడో రేవంత్ కు తెలియదన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. కాంగ్రెస్‌ గ్యారంటీల అమలు అర్రాజ్‌ పాటలా మారాయన్నారు. రైతుబంధు ఆపొద్దు .. వ్యవసాయం సాగనివ్వండి అని కోరాం. అదే సమయంలో హామీల అమలుకు సమయం తీసుకోమని కూడా చెప్పాం. రైతుబంధును ఆపేసి వ్యవసాయాన్ని ఆగం చేశారన్నారు. ఇవాళ(గురువారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం లక్కి దువ్వలో లాటరీ లాంటిది. కేసీఆర్ ను తిట్టడానికి రేవంత్ ముఖ్యమంత్రి కాలేదు.మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి .. కార్యాచరణ ప్రకటించాలి. కొడంగల్ సభలో రేవంత్ భాష, వ్యవహార శైలి సీఎం  హోదాకు తగినట్లుగా లేదు. ముఖ్యమంత్రిగా అయ్యాక కూడా ఎందుకో రేవంత్ తన తీరును సమీక్షించుకోవడం లేదు. రేవంత్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం .. మంచి విషయాలు చర్చకు పెట్టి .. పాలన మీద దృష్టిపెట్టాలి.

పాలమూరు కష్టాలకు కేసీఆర్ కారణం అని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు నిరంజన్ రెడ్డి. ముంబై, దుబాయి, బొగ్గుబాయి కాంగ్రెస్ పుణ్యమేనన్నారు. కరెంట్ , నీళ్లు, రైతుబంధు, రైతుభీమా ఇచ్చి రైతులకు అండగా నిలిచింది కేసీఆర్. రేవంత్ అధికారంలోకి రాగానే అన్నీ కట్క బంద్ చేసినట్లుగా ఆగిపోయాయి. కొడంగల్ లో ఓడిపోయాక మల్కాజ్ గిరిలో గెలిచి ఎంపీ అయ్యాక రేవంత్ ఎన్ని సార్లు తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి మాట్లాడారు?.తెలంగాణ ఉద్యమంలో రేవంత్ పాత్ర గుండు సున్నా .. కొడంగల్ లో రాజకీయ పునాదులను పటిష్టం చేసుకునేందుకే రేవంత్ పనులు. కొడంగల్ కు చేసిన పనులు మొత్తం పాలమూరుకు చేస్తున్నట్లు భ్రమలు కల్పిస్తున్నారు.కొడంగల్ లో శంకుస్థాపన చేసిన కళాశాలలు అన్నింటికీ అనుమతులు తెచ్చింది కేసీఆర్  .. ఇందులో రేవంత్ గొప్పతనం ఏముందని ప్రశ్నించారు.

174 టీఎంసీలు గ్రావిటీ ద్వారా పాలమూరుకు రావాల్సిన నీటిని పొగొట్టిన పాపం కాంగ్రెస్ పార్టీదే. దశాబ్దాల పాటు జూరాల, నెట్టెంపాడు, భీమా పథకాల నిర్మాణాలను కాంగ్రెస్ పార్టీ సాగదీసింది. 35 ఏండ్లు, 40 ఏండ్ల పాటు పాలమూరు ప్రాజెక్టులను సాగదీసిన కాంగ్రెస్ రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేసి పాలమూరు ప్రాజెక్టులు ఎండబెట్టారు. 3.94 లక్షల ఎకరాల కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం 3.9 టీఎంసీల రిజర్వాయర్లను నిర్మించారు.17 రిజర్వాయర్లను టెండర్లకు ముందే కాంగ్రెస్ ఎత్తివేసింది.కల్వకుర్తి పరిధిలోని ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లిలలో ఉన్న ఐదు పంపులు ఎన్నడూ నడవవు .. ఐదూ నడిస్తే టన్నెళ్లు, కాలువలు సరిపోవు. మూడు పంపుల సామర్ధ్యం ఉన్న కాలువలు, టన్నెళ్లు నిర్మించి ఐదు పంపులు బిగించారు. సగం, సగం పనులు చేసి కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసింది. 2014, 2019లో కల్వకుర్తి ఎత్తిపోతల పంపులు అన్నీ నీట మునిగాయి. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా మేము ఎన్నడూ రాజకీయం చేయలేదు. ఎలా చేస్తే బాగవుతాయి అని ఆలోచించి పనులు చేసి రైతులకు నీరందించామన్నారు నిరంజన్ రెడ్డి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే రైతుల పొలాలకు సాగునీరు అందించడం జరిగింది.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసుల మీద కేసులు వేసి వేధించారు . వాటన్నింటినీ తట్టుకుని నీళ్లిచ్చే దశకు తీసుకువచ్చాం .. ఇప్పుడే మీరు అధికారంలోకి వచ్చారు.వేల కోట్లు ఖర్చు చేసి నీళ్లివ్వలేదని మాట్లాడడం అవివేకమన్నారు నిరంజన్ రెడ్డి.

కేసీఆర్ ఎక్కడి నుండి వచ్చాడు అని చవకబారు మాట్లాడడం భావ్యం కాదు. రేవంత్ కొడంగల్ ఎందుకు వెళ్లాడు ? మల్కాజ్ గిరి ఎందుకు వెళ్లాడు ? రాహుల్ వాయనాడ్, సోనియాగాంధీ రాజస్థాన్ ఎందుకు వెళ్లారు ?.కేసీఆర్ కేంద్రమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అన్ని చోట్లా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికై సేవలు అందించారు. కేసీఆర్ కు మించి పనులు చేసి రేవంత్ గొప్ప వ్యక్తి అనిపించుకుంటే మాకు ఎలాంటి అసూయ లేదు.మిమ్మల్ని పుట్టించిన భగవంతుడు కూడా మీరిచ్చిన హామీలు అమలు చేయలేరు. ఒకటో గ్యారంటీ, రెండో గ్యారంటీ అంటూ హామీలను అర్రాజ్ పాటలా ప్రకటిస్తున్నారు.రైతుబంధు వేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు ? ఎండిన పంటలు, సాగిన సాగు వెనక్కు వస్తాయా అని ప్రశ్నించారు?. కాంగ్రెస్ నిర్వాకంతో యాసంగిలో పావు వంతు కూడా సాగు కాలేదు. గతేడాది, ఈ ఏడాది సాగు లెక్కలు అధికారికంగా ప్రకటించే దమ్ము ప్రభుత్వానికి ఉందా ? పాలమూరులో మొన్నటి వరకు 14 స్థానాలలో, రాష్ట్రంలో 88 స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. భవిష్యత్ లో ఘోర పరాభవానికి కాంగ్రెస్ ఇప్పటి నుండే సిద్ధం కావాలన్నారు నిరంజన్ రెడ్డి.

ఇది కూడా చదవండి:షణ్ముఖ్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

Latest News

More Articles