Sunday, May 19, 2024

షణ్ముఖ్ అరెస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!!

spot_img

ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేం షణ్ముక్ జస్వంత్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యూట్యూబ్ లో తనకు ఆవకాశాలు ఇపిస్తాననిచెప్పి..షణ్ముక్ మోసం చేశాడంటూ డాక్టర్ మౌనిక పోలీసులను ఆశ్రయించింది. షణ్ముక్ తోనే అతని అన్ని సంపత్ పరిచయం అయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మౌనిక పేర్కొంది. షణ్ముక్ అన్న సంపత్ వినయ్ హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు తెలిపింది. ఓ సారి తనకు అబార్షన్ కూడా చేయించడాని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.

అయితే సంపత్ కు తనకు మూడేళ్ల క్రితం నిశ్చితార్థం జరిగిందని తెలిపింది. రెండు కుటుంబాలు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాయన్న పేర్కొన్న మౌనిక ..వేరే అమ్మాయితో పెళ్లికి సంపత్ సిద్దమయ్యాడని పోలీసులకు తెలిపింది. పోలీసులను తీసుకుని సంపత్ ఫ్లాట్ వెళ్లినట్లు వివరించింది. వాళ్ల దగ్గర డగ్స్ ఉన్నట్లు చెప్పింది. తనను కాంప్రమైజ్ చేసేందుకు కానిస్టేబుల్ జావెద్ ఒత్తిడి చేశాడని మౌనిక ఆరోపించింది. నిజం బయటకు చెబితే ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని షణ్ముఖ్ అన్న సంపత్ బెదిరించడాని బాధితురాలు తెలిపింది.

ఇది కూడా చదవండి: ఇదేం పోయే కాలం? శ్మశాన వాటికలో సినిమా టీజర్ రిలీజ్..!!

Latest News

More Articles