Friday, May 17, 2024

రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఎప్పుడిస్తరు?

spot_img

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కల్యాణ లక్ష్మి చెక్కులు పాతవి ఇస్తున్నారు. మరీ అదనంగా ఇస్తామన్న తులం బంగారం ఏదీ? రైతు బంధు స్థానంలో రైతు భరోసా ఏమైంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వైఫల్యాలు ఎండగడుతూ ప్రజలను ఎప్పటికపుడు అప్రమత్తం చేయాలనీ నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Also Read.. ఖమ్మం కన్నేస్తే ఖబడ్దార్..!

‘‘మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజక వర్గ సన్నాహాక సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అధ్యక్షతన జరిగింది. ఏడు నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు హాజరయ్యారు. 2009, 2014, 2019లలో వరసగా మూడు సార్లు మహబూబ్ నగర్ ఎంపీ సీటును బీఆర్ఎస్ గెలుచుకుంది. 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నపుడే తెలంగాణ కల సాకారమైంది.

Also Read.. ఆ రోజులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు హాఫ్‌ హాలిడే

పార్లమెంటులో తెలంగాణ గొంతుక బలంగా వినబడాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు గెలవాలి. గత రెండు లోక్ సభల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే కాంగ్రెస్, బీజేపీ ఎంపీల కన్నా ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలతో ప్రజలు మోసపోయారు. ప్రజలందరూ ఇపుడు ఆలోచన చేస్తున్నారు. మన కండ్లు మనమే పొడుచుకున్నాం అని ప్రజలు బాధ పడుతున్నారు. కనీసం పార్లమెంటు ఎన్నికల కోసమైనా కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న అమలు చేస్తామన్న హామీలు అమలు చేస్తారో చూడాలి. కేసీఆర్ హాయాంలో చెప్పినవి, చెప్పనవి కూడా చేశాము.

Also Read.. సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు కొత్త నిబంధనలు

పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి గెలుస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే అందరికన్నా సంతోష పడే వాళ్ళం మేమే. లోక్ సభ అభ్యర్థులను కేసీఆర్ అన్నీ ఆలోచించి ఖరారు చేస్తారు. సన్నాహక సమావేశాలు ముగిశాక మా తదుపరి కార్యాచరణను కేసీఆర్ నిర్ణయిస్తారు. పార్టీ నిర్ణయాలకు అందరూ కట్టుబడాల్సిందే. మాది క్రమ శిక్షణ గల పార్టీ.’’ అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Latest News

More Articles