Friday, May 17, 2024

వెన్నుపోటుతోనే ఓటమి.. పార్టీ అధిష్టానానికి నివేదిక అందిస్తా

spot_img

జయశంకర్ భూపాలపల్లి : ఫలితాల చాలా నిరాశ కలిగించాయని, గడిచిన 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించడంలో ఉన్నప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతితో కలిసి మాట్లాడారు. కరోనా లాంటి పరిస్థితుల్లో నిత్యం ప్రజలకు అంత్యంత చేరువగా ఉండి సేవలు అందించానని తెలిపారు.

ప్రభుత్వ పరమైన కార్యక్రమాలతో పాటు, GMTM ట్రస్ట్ ద్వారా చాలా సేవలను అందించినం. భూపాలపల్లికి ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలు కృషి చేశాను. ప్రజల తీర్పు స్వాగతిస్తున్న. ప్రజల తీర్పుతో గెలిచిన సత్యనారాయణ రావును అభినందిస్తున్న. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా పనిచేయాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

100 రోజుల్లో అమలు చేస్తారనే నమ్మకంతో ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ  నిలబెట్టుకోవాలి. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదా నిర్వహిస్తా. ఓటమిలో జరిగిన వెన్నుపోటుపై పార్టీ అధిష్టానానికి నివేదిక అందిస్తా. చాలా వరకు జరిగిన పార్టీ ఫిరాయింపుల పట్ల మండల స్థాయిలో నివేదికలు తీసుకుని పార్టీ అద్యక్షడు, కార్యనిర్వాహక అధ్యక్షుడికి తెలియజేస్తానని గండ్ర వెంకటరమణా రెడ్డి తెలిపారు.

Latest News

More Articles