Friday, May 17, 2024

ఆ రెండు తప్ప.. ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వొద్దు

spot_img

ప్రజలకు ఏదీ ఫ్రీగా ఇవ్వకూడదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజలకు అన్నీ ఉచితంగా ఇచ్చే బదులు.. వారికి నిత్యావసరాలైన విద్య, వైద్యం మాత్రమే ఫ్రీగా ఇవ్వాలి అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన పైవ్యాఖ్యలు చేశారు.

Read Also: కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలంటే..? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ, తెలుగుని మర్చిపోవద్దు అన్నారు. ప్రతి మనిషి, ప్రతి రోజు తెలుగులో మాట్లాడితే బాగుంటుందని, ప్రతి వ్యక్తికి మొదటి మన దైవం కన్న తల్లిదండ్రులే అనేది గుర్తించాలన్నారు. మాతృభాషను మొదట చదువుకోని ఆర్వాత ఇంగ్లీష్ భాషపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఇక ఏ ప్రభుత్వాలు అయినా సరే పోటాపోటీగా ఉచితాలు ఇవ్వడం మంచి పద్దతి కాదన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలని సూచించారు. మనం పోయిన తర్వాత మనల్ని నలుగురు గుర్తుంచుకోవాలి అంటే కచ్చితంగా మంచి పనులు చేయాలన్నారు. శారీరకంగా దృడంగా ఉంటేనే, మానసికంగా ధృఢంగా ఉంటామని, అందుకే ప్రతిరోజూ యోగ చేయడం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మనదేశంలో లభించే రుచులు దేశంలో మరెక్కడా దొరకవన్నారు. ప్రతి ఇంట్లో వంట గది, పూజ గది తప్పకుండా ఉండాలన్నారు. ఇటీవల యువత ఫాస్ట్‌ఫుడ్‌ కల్చర్‎కి బాగా అలవాటు పడుతున్నారని, అది ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.

Latest News

More Articles