Monday, May 20, 2024

కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలంటే..? కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

spot_img

కేసీఆర్‌కే ఎందుకు ఓటేయ్యాలో సవివరంగా చెబుతూ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాబోయే 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల గురించి ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్ర‌జ‌ల స్వ‌రాన్ని పార్ల‌మెంట్‌లో గ‌ట్టిగా, స్ప‌ష్టంగా వినిపించేది కేవ‌లం బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మేన‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Read also: గవర్నర్ తమిళిసై ట్విట్టర్ హ్యాక్

ఉదాహ‌ర‌ణగా 16, 17వ లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హ‌క్కులు, ప్ర‌యోనాల కోసం కేంద్రాన్ని నిల‌దీసిన సంద‌ర్భాన్ని గుర్తు చేశారు. పార్ల‌మెంట్‌లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని ఎన్నిసార్లు ప్ర‌శ్నించారో ఆ వివ‌రాల‌ను గ‌ణాంకాల‌తో స‌హా వివ‌రించారు. లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ ఎంపీలు కేంద్రాన్ని 4,754 సార్లు ప్ర‌శ్నించ‌గా, కాంగ్రెస్ 1271 సార్లు, బీజేపీ కేవ‌లం 190 సార్లు మాత్ర‌మే ప్ర‌శ్నించిన‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి.

2014లో రాష్ట్రం సాధించినప్పుడు తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక టీఆర్ఎస్ మాత్ర‌మే అని కేటీఆర్ చెప్పారు. 2024లో కూడా తెలంగాణకున్న ఏకైక గొంతుక మన పార్టీ మాత్రమే అని స్ప‌ష్టం చేశారు. నాడు .. నేడు.. ఏనాడైనా.. తెలంగాణ గళం.. తెలంగాణ బలం … తెలంగాణ దళం.. మనమే.. అని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest News

More Articles