Friday, May 17, 2024

నేటి నుంచి అయోధ్య రాముడి ఉచిత దర్శనం

spot_img

భారతీయుల దశాబ్దాల కల నెరవేరిన వేళ..అయోధ్యలో శ్రీరామ మందిరం చూడాలనుకునే కోట్లాది హిందువుల ఆ భాగ్యం నెరవేరబోతుంది. జనవరి 22న ప్రాణప్రతిష్టతో మొదలైన అయెధ్య రామమందిర దర్శనం నేటి నుంచి సాధారణ భక్తులకు శ్రీరాముడి దర్శన కల్పిస్తోంది అయోధ్య ఆలయ ట్రస్టు. ప్రధాని మోదీతోపాటు వేలాడి మంది యోగులు, బుుషుు, వేదపండితుల సమక్షంలో ప్రాణప్రతిష్ట అత్యంత వైభవంగా ముగిసింది. సోమవారం దివ్య ముహుర్తంలో ఆ భవ్యరాముడి జన్మస్థలంలో వేద మంత్రాలు, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఈ కార్యక్రమం వైభవంగా ముగిసింది.

ఈరోజు సామాన్య భక్తులు కూడా అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చని అయోధ్య ట్రస్టు తెలిపింది. అయోధ్య వెళ్లే భక్తులకు దర్శనం పాస్ లు ఎలా పొందాలనే విషయంపై స్పష్టత కూడా ఇచ్చింది.

అయోధ్య రాముని దర్శన వేళలు ఇవే:
భక్తులు ఉదయం 7గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7గంటల వరకు శ్రీరాముడిని దర్శనం చేసుకోవచ్చు. ఉదయం 6.30 గంటలకు ఉదయం హారతి, రాత్రి 7.30 సంధ్యాహారతి ఉంటుంది. భక్తులు ముందుగానే పాసులను ఆఫ్ లైన్, ఆన్ లైన్ ద్వారా పొందవచ్చు. పాస్ లు పొందినవారు హారతి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఆన్ లైన్ లో బుక్ చేుకునేందుకు అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేసి మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి. మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే వ్యక్తుల గుర్తింపు నిర్దారణ అవుతుంది.

ఇది కూడా చదవండి : మధ్యాహ్నం భోజనం తర్వాత 15నిమిషాల కునుకు చాలా మంచిది..!!

లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. హారతి లేదా దర్శనంలో కావాల్సిన స్లాట్ ను ఎంచుకోవాలి. అవసరమైన వివరాలన్నింటిని నింపాలి. ఆ తర్వాత వివారాలన్నింటిని చెక్ చేసుకుని బుకింగ్ ను పూర్తి చేసి పాస్ ను తీసుకోవాలి. ప్రవేశానికి ముందు ఆలయం కౌంటర్ దగ్గర భక్తులు పాస్ లను పొందవచ్చు. ప్రస్తుతం ఆన్ లైన్ బుకింగ్ హోల్డింగ్ లో ఉంది. హారతికి అరగంట ముందు ఆలయం దగ్గర ఉండాలి. నేడు భక్తుల రద్దీ ఎక్కుగా ఉండే అవకాశం ఉండటంతో వ్రుద్ధులు, వికలాంగులకు ప్రత్యేక టైమ్ స్లాట్ లేదా ప్రత్యేక దర్శనాన్ని కల్పించాలని ట్రస్టు భావిస్తోంది.

Latest News

More Articles