Sunday, May 19, 2024

ఢిల్లీలో భారీ వర్షం.. జీ-20 సదస్సు వేదికగా రూ. 2700 కోట్లు నీటిపాలు

spot_img

దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు నేడు చివరి రోజు. నిన్న రాత్రి నుండి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షానికి చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా భారత మండపం ప్రాంగణం కూడా జలమయమైంది. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. G20 సభ్యులకు ఆతిథ్యం ఇవ్వడానికి నిర్మించిన భారత్ మండపం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ మండపం ముందు మొత్తం నీరు నిలిచింది.

‘బీజేపీ చేసిన అభివృద్ధి బహిర్గతమైంది. జి-20 కోసం భారత్ మండపాన్ని సిద్ధం చేశారు. రూ. 2700 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక్క వర్షంలో అంతా కొట్టుకుపోయింది’ అంటూ రాసుకొచ్చారు.

Latest News

More Articles