Tuesday, May 7, 2024

ఓటీటీ‎లోకి మెగాస్టార్ ‘భోళా శంకర్’

spot_img

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా నటించగా.. చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేశ్ నటించింది. ఈ సినిమా ఆగష్టు 11న విడుదలైంది. ఎన్నో ఎక్స్‎పెక్టెషన్స్‎తో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చిరు కెరీర్‌లో తొలిసారి జీరో షేర్‌ అనే మాట వినాల్సి వచ్చిందంటే అది భోళా శంకర్‌ సినిమాతోనే. ఈ సినిమా కొట్టిన దెబ్బ అంతా ఇంతా కాదు. మెగా అభిమానులు దీన్నొక పీడకలలా వర్ణిస్తుంటారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అందులో పావు వంతు కలెక్షన్‌లు కూడా తెచ్చిపెట్టలేకపోయింది.

కాగా, ఇప్పుడీ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబర్‌ 15 నుంచి ఇది సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కింది. సుశాంత్‌ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై అనీల్‌ సుంకర నిర్మించాడు.

అయితే త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లోకి రాబోతున్న ‘భోళా శంకర్’ మూవీని సెన్సార్ లేకుండానే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కూడా ఓ న్యూస్ లీకైంది. థియేటర్లలో కొన్ని డైలాగులతో పాటు విలన్ తలను నరికే సీన్‌ను కట్ చేశారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే వెర్షన్‌లో మాత్రం అవన్నీ ఉంటాయని తెలుస్తోంది.

Latest News

More Articles