Sunday, May 19, 2024

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ గా సౌరవ్ గంగూలీ

spot_img

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఇటీవలే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తిచేసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీవిరమణ చేసిన తర్వాత .. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ (హెడ్ ఆఫ్ క్రికెట్) గా గంగూలీ మళ్లీ క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టులో చేరిన సౌరవ్ గంగూలీ ఐఎల్‌టీ20 దుబాయ్ క్యాపిటల్స్, అలాగే సౌతాఫ్రికాటీ20 లీగ్‌లో ప్రెటోరియా క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడు.

2019లో గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరించారు. అదే ఏడాది బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో గంగూలీ ఐపీఎల్ పదవి నుంచి వైదొలిగారు.

Latest News

More Articles