Saturday, May 11, 2024

ఎంపీ సంతోష్ ను కలిసిన గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ డా.సతీష్ శిఖ

spot_img

హైదరాబాద్: ప్రఖ్యాత గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ డాక్టర్ సతీష్ శిఖ ఈరోజు ప్రగతి భవన్ లో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ అధినేత, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ని కలిశారు. గతంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అయిన డాక్టర్ సతీష్ శిఖ 2007 సంవత్సరంలో తన లాభదాయకమైన ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తిని వదిలి గ్లోబల్ వార్మింగ్ ఆక్టివిస్ట్ గా మారారు.

భారత్ లో పుట్టిన కెనాడా ఎన్నారై అయిన డాక్టర్ సతీష్ శిఖ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కృషిగాను మంగోలియా దేశంలోని ఎకో ఏషియా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.  భారత దేశమంతటా నిరుపేద పిల్లలకు మద్ధతు ఇవ్వడానికి ‘90 మిలియన్ స్మైల్స్ ఫౌండేషన్’ అనే సంస్థను డాక్టర్ సతీష్ స్థాపించాడు.

2007లో ఒక కిలోమీటర్ పొడవునా ‘ఎకో గ్రీన్ హ్యాండ్ మేడ్ సిల్క్ క్లాత్ ఫ్యాబ్రిక్’ ని నిర్మించడం జరిగింది. ఈ సిల్క్ క్లాత్ పై (ప్రతి సందేశానికి ఒక గజం) పర్యావరణానికి మద్దతుగా అనేక మంది తమ సందేశాలు ఇవ్వడం జరిగింది. 72 దేశాల నుండి సుమారు 1,263 మంది ప్రముఖులు, పర్యావరణ కార్యకర్తల సందేశాలతో సిల్క్ క్లాత్ 1.2 కి.మీ. కంటే ఎక్కువ పొడవుగా మారింది.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ద్వారా పర్యావరణానికి చేస్తున్న విశేష కృషిని గుర్తించి సిల్క్ ఫ్యాబ్రిక్ పై తమ సందేశాన్ని ఇవ్వవలసిందిగా డాక్టర్ సతీష్ శిఖ అభ్యర్థించారు. పర్యావరణ పరిరక్షణకు తగిన చొరవ చూపుతున్న డాక్టర్ సతీష్ శిఖ కార్యక్రమానికి ముగ్ధుడైన గ్రీన్ ఇండియా చాలెంజ్ అధినేత సంతోష్ కుమార్ అతని అభ్యర్థనను గౌరవిస్తూ..  ‘‘మొక్కలను నాటండి, రక్షించండి, ప్రోత్సహించండి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దేశాన్ని, భూగోళాన్ని రక్షించండి’’ అంటూ ఒక గజం సిల్క్ ఫ్యాబ్రిక్ (పట్టు వస్త్రం)పై తన సందేశాన్ని ఇచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ శిఖ సానుకూల శక్తి, గురుత్వాకర్షణకు చిహ్నమైన ఒక ‘అదృష్టమైన రాగి నాణం’ ను ఎంపీ సంతోష్ కుమార్ కి బహుమతిగా ఇచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేస్తున్న కార్యక్రమాలను డాక్టర్ సతీష్ శిఖ ఎంతగానో ప్రశంసిస్తూ వాటిని నిరంతరంగా కొనసాగించాలని కోరారు.

Latest News

More Articles