Friday, May 17, 2024

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌: సెమీస్‌కు దూసుకెళ్లిన గాఫ్, జ‌కోవిచ్

spot_img

ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ నొవాక్ జ‌కోవిచ్‌ 11వ సారి సెమీస్‌కు దూసుకెళ్లాడు. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైనల్ మ్యాచ్ లో టేల‌ర్ ఫ్రిట్జ్‌ ను 7-6(3), 4-6, 6-2, 6-3తో చిత్తుగా ఓడించాడు. దీంతో రోజ‌ర్ ఫెద‌ర‌ర్ త‌ర్వాత అంత‌ర్జాతీయ టెన్నిస్‌లో 700 వ హార్డ్ కోర్టు విజ‌యం సాధించిన ప్లేయర్ గా జ‌కో రికార్డు నెల‌కొల్పాడు.

Also Read.. రామ మందిరంపై పాక్ జెండాలతో ఫొటో మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్

మరోవైపు మ‌హిళ‌ల సింగిల్స్‌లో అమెరికా టీనేజ‌ర్‌ కొకో గాఫ్ సెమీ ఫైన‌ల్లో ప్రవేశపెట్టింది. మర్టా కొస్త్యుక్‌ పై 7-6(6), 6-7(3), 6-2 స్కోరుతో ఓడించింది. ఆమెకు ఇది తొలి ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ సెమీస్ కావ‌డం గమనార్హం. ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో వ‌రుస‌గా 10 మ్యాచ్‌లు గెలిచిన రెండో క్రీడాకారిణిగా గాఫ్ రికార్డు నమోదు చేసింది. అంతకుముందు 2001లో బెల్జియం స్టార్ జ‌స్టిన్ హెనిన్ ఈ ఘనత సాధించారు.

Latest News

More Articles