Thursday, May 2, 2024

ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలె

spot_img

వినియోగదారుల అవసరాన్ని ఆసరగా చేసుకొని మందుల షాపు నిర్వాహకులు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ షాపుల్లో ఎక్కువ గిరాకీ కావాలని.. నాసిరకం మందులు తెచ్చి తక్కువ ధరకు విక్రయిస్తుంటారు. అటువంటి షాపులన్నింటిపై చర్యలు తీసుకుంటామని డైరెక్టర్ జనరల్, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.

Read Also: ఫిబ్రవరి 3 నుంచి బీఆర్‌ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు

‘ఫార్మాసిటికల్స్‎కి సంబంధించిన అనుమతులను ఆన్‎లైన్ ద్వారా లైసెన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటాం. మా దృష్టికి వచ్చిన కొన్నింటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నకిలీ మందులు చలామణి కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఎప్పటికప్పుడు మందులును పరిశీలన చేసి వాటిని ల్యాబ్‎కి పంపించి టెస్ట్ చేస్తున్నాం. ఉత్తరఖాండ్ లాంటి రాష్ట్రాల నుంచి బ్రాండెడ్ పేరుతో నకలీ మందులు కొరియర్ ద్వారా రాష్ట్రానికి వస్తున్నాయ్, వాటిని కూడా పట్టుకోవడం జరిగింది. నకిలీ మందుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మెడికల్ షాపులు ఉన్నాయి. ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. మందులపై ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చే వాటిని గుర్తించాలి, అప్రమత్తంగా ఉండాలి. వైద్యారోగ్యశాఖ ఎప్పటికప్పుడు వీటిపైన అప్రమత్తంగా ఉంటుంది’ అని ఆయన తెలిపారు.

Latest News

More Articles