Friday, May 3, 2024

రూ. 74వేలు దాటిన బంగారం ధర..పెరుగుట విరుగుటకేనా?

spot_img

దేశంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలోపెరుగుతూనే ఉన్నాయి. పసిడి ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధరరూ. 10 పెరిగి రూ. 68,160కి చేరుకుంది. శుక్రవారం ఈ ధర రూ. 68,150గా ఉండేది. ఇక ఒక గ్రాము బంగారం ధర రూ. 6,816గా కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 10 పెరిగింది. రూ. 74,350కి చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 68,310గా ఉంటే..24క్యారెట్ల బంగారం ధర రూ. 74,500గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 68,160 పలుకుతోంది. 24క్యారెట్ల బంగారం 74,350గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధర రూ. 68,160గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 74,350గా నమోదు అయ్యింది. విజయవాడలో కూడా ఇవే ధరలుకొనసాగుతున్నాయి. విశాఖలోనూ ధరలు ఈవిధంగానే ఉన్నాయి.

దేశంలో వెండి ధరలు కూడా శనివారం పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 86,500గా ఉంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 89,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 86,400, బెంగుళూరులో 85,900గా నమోదు అయ్యింది.

ఇది కూడా చదవండి: నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుకు గడువు.!

Latest News

More Articles