Friday, May 3, 2024

నేటితో ముగియనున్న టెట్ దరఖాస్తుకు గడువు.!

spot_img

ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు గడువు నేటితో (శనివారం )ముగియనున్నది. శుక్రవారం సాయంత్రం నాటికి టెట్‌కు 2,63,228 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నేటితో గడువు ముగియనుండటంతో అభ్యర్థులు చివరి క్షణం వరకు వేచి ఉండకుంటా త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి:
-టెట్ రాయాలనుకునే అభ్యర్థులు https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లండి.

-‘Fee Payment’ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఫీజును చెల్లించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయితేనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

-హోంపేజీలో కనిపించే ‘Application Submission’ అనే లింక్ పై క్లిక్ చేసి.. ఇక్కడ మీ వివరాలను ఎంటర్ చేయండి.

-దరఖాస్తు ఫారమ్ లో ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్ లోడ్ చేయాలి.

-అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత చివర్లో ఉండే సబ్మిట్ బటన్ పై నొక్కండి. దీంతో మీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.

-‘Print Application’ అనే ఆప్షన్ పై నొక్కి.. మీ దరఖాస్తు కాపీనీ డౌన్లోడ్ లేదా ప్రింట్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసేటప్పుడు ఈ నెంబర్ ఉపయోగపడుతుంది.

ఎడిట్ ఇలా చేసుకోండి:

-టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లండి.

-హోం పేజీలో Edit Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-ఇక్కడ Journal Number/Payment Reference ID, Date of Birth ను నమోదు చేసి ఎంటర్ చేయాలి.

-ఇప్పుడు మీ దరఖాస్తు ఒపెన్ అవుతుంది. ఇక్కడ మీ వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.

-చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ కంప్లీట్ అవుతుంది.

-ప్రింట్ అప్లికేషన్ పై క్లిక్ చేసి మీ దరఖాస్తు ఫారమ్ ను తీసుకోవచ్చు.

-ఈ ఆప్షన్ తో మీ దరఖాస్తును ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం ఒక్కసారి ఉంటుంది.

-ఒక్కసారి ఎడిట్ చేసి సబ్మిట్ చేస్తే… మళ్లీ ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉండదు.

ఇది కూడా చదవండి: రైతులను నిండాముంచిన అకాల వర్షాలు..నీటిపాలైన వడ్ల కుప్పలు.!

Latest News

More Articles