Saturday, May 4, 2024

గుడ్ న్యూస్ తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతంటే?

spot_img

గత కొన్నాళ్లుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా బంగారం ధర రూ. 75వేల మార్క్ కు చేరుకుంది. వెండి కూడా కేజీ ధర రూ. 90వేలకు చేరువయ్యింది. దీంతో కొనుగోలు దారులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పుడు వారికి కాస్త రిలీఫ్ దక్కింది. పెరుగుతూపోతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత మూడు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొసాగుతున్నాయి.

నిన్నటితో పోల్చితే..ఇవాళ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 6గంటల వరకు నమోదు అయిన ధరల ప్రకారం 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 74వేల 230గా ఉంది. వెండి కేజీ రూ. 89వేలుగా ఉంది. ఇదిలా ఉండగా రాబోయే పెళ్లిళ్ల సీజన్ నాటికి బంగారం ధరలు రూ. లక్షలకు చేరువయ్యే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండికి భారీగా డిమాండ్ ఉండటమే పెరుగుదలకు కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

-హైదరాబాద్‌‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,040,

-24 క్యారెట్లు రూ. 74,230

-విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్లు రూ.68,070

-24 క్యారెట్లు రూ.74,230

-వరంగల్‌లో 22 క్యారెట్లు రూ. 68,040

-24 క్యారెట్ల బంగారం రూ. 74,230

వెండి ధరలు..
కేజీ వెండి ధర రూ. 100 తగ్గి హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌లలో రూ.89,900లుగా ఉంది.

ఇది కూడా చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై మరో కేసు

Latest News

More Articles