Saturday, May 4, 2024

బంగారం కొనుగోలు చేసేవారికి ఊరట.. స్థిరంగా బంగారం ధర

spot_img

బంగారం కొనుగోలు చేసే వారికి కాస్త ఊరట లభించింది. నిన్నటి రోజున పెరిగిన బంగారం ధరలు ఇవాళ మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. మన ఇండియాలో బంగారానికి ఉన్నటువంటి డిమాండ్ ఇంకొక వస్తువుకు లేదన్న సంగతి తెలిసిందే. దీంతో ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ మహానగరంలో స్థిరంగా నమోదు అయిన బంగారం ధరల వివరాల ప్రకారం…. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 690 కాగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56, 550గా నమోదు అయింది. ఇక వెండి ధరల విషయానికి వస్తే…. బంగారం లాగా కాకుండా వెండి ధరలు కాస్త తగ్గాయి. కిలో వెండిపై 500 రూపాయలు తగ్గి రూ. 79,000గా నమోదు అయింది.

Read Also: మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో రూ.340 కోట్లు స్వాధీనం

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,790 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.56,550, 24 క్యారెట్ల ధర రూ.61,690గా ఉంది.

Latest News

More Articles