Sunday, May 19, 2024

శ్రీరామనవమికి భద్రాచలం వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త.!

spot_img

శ్రీ రామనవమి పండుగ సందర్భంగా… భద్రాచల రాముల వారి భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికులను ఆకర్శించడానికి వివిధ కొత్త కొత్త సేవలను ప్రారంభిస్తున్న ఆర్టీసీ.. ఇప్పుడు రాములోరి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. పండుగలు, ప్రత్యేక రోజుల సందర్భంగా ప్రముఖ ఆలయాలకు సర్వీసులను నడుపుతూ భక్తులకు రవాణ సులభం చేస్తుంది. ఈమధ్యే మేడారం వెళ్లకుండానే బంగారాన్ని అమ్మవారికి సమర్పించే అవకాశం కల్పింది. ఇప్పుడు శ్రీరామనవమి సందర్బంగా రాములవారి భక్తుల కోసం మరో సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది.

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే రాములవారి  తలంబ్రాలను భక్తులకు అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములవారి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేర్చే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత ఉన్న ఈ తలంబ్రాలు భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ. 151చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలి. శ్రీ రామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ ఇంటికి పంపిస్తుంది. హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో  భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ ను  టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌ ఆవిష్కరించారు. భద్రాద్రిలో ఈ నెల 17న జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరింది.

ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..నలుగురు మావోయిస్టులు మృతి.!

Latest News

More Articles