Friday, May 17, 2024

గూగుల్ న్యూ ఇయర్ సరికొత్త డూడుల్

spot_img

2023 ఏడాదికి గుడ్ బై చెబుతూ 2024 కు స్వాగతం పలుకుతూ ప్రముఖ సెర్చింజన్ గూగుల్ సరికొత్త డూడుల్ ను రూపొందించింది. సందర్భానుసారంగా వినూత్న డూడుల్ ను ప్రదర్శించే గూగుల్.. ఈ కొత్త సంవత్సరం సందర్భంగా యానిమేటెడ్ డూడుల్ కు రూపకల్పన చేసింది. గతేడాది తీపి జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. రాబోయే ఏడాదికి సంబంధించిన ఆకాంక్షలను ప్రతిఫలించేలా తయారు చేసింది.

ఈ యానిమేటెడ్ డూడుల్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రముఖుల జయంతి, వర్ధంతి సహా పలు ప్రత్యేక సందర్భాలలో వినూత్న డూడుల్స్ తో వారికి నివాళులు తెలియజేయడం గూగుల్ ఆనవాయితీగా కొనసాగిస్తోంది. దీంతో పాటు న్యూఇయర్ కు వెల్కమ్ చెప్పేందుకు తాజాగా ఈ సరికొత్త డూడుల్ ను రూపొందించింది.

ఇది కూడా చదవండి: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

Latest News

More Articles