Saturday, May 18, 2024

చిన్న అరుణాచలంలో ఘనంగా శివ ముక్కోటి వేడుకలు

spot_img

చిన్న అరుణాచలంలో శివ ముక్కోటి వేడుకలు ఘనంగా జరిగాయి. భద్రాచలం లోని పర్ణశాల  మార్గంలోని ఉన్న క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం..  చిన్న అరుణాచలం. ఆ క్షేత్రంలో శివ ముక్కోటి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అరుణాచలేశ్వర స్వామి ఉద్భవించిన రోజును పురస్కరించుకొని ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తర ద్వారం ద్వారా అరుణాచలేశ్వర స్వామి వారు భక్తులు దర్శనం చేసుకున్నారు. మూడు రోజులుగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి(శుక్రవారం)తో  పూర్తయినట్లు అలయ వ్యవస్థాపకులు శివనాగ స్వామి తెలిపారు.

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని , దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని శ్రీ రమణ ఆశ్రమంలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది.  ఇది  చిన్న అరుణాచలంగా ప్రసిద్ధిగాంచింది. ఒకే చోట మొత్తం 12 జ్యోతిర్లింగాలు కొలువై ఉండటం ఈ క్షేత్రం విశిష్టత. అంతేకాదు.. ఒకే లింగం మీద స్పటిక లింగం, సహస్ర లింగాలు కలిపి ఒకే లింగం మొత్తం 1007 లింగాలు.. ప్రధాన లింగంతో కలిపి మొత్తం 1008 లింగాలు ఉన్నాయి.  కాశి క్షేత్రం, శ్రీశైలం, అరుణాచలం, కంచి వంటి పుణ్యక్షేత్రాల్లో మాత్రమే ఇలా సహస్ర లింగాల దర్శనం జరుగుతుంది.

Latest News

More Articles