Sunday, May 19, 2024

చెత్త చిత్రం.. చీల్చిచెండాడిన గృహలక్ష్మి

spot_img

యానిమల్ మూవీ ఎంతటి భారీ విజయం సాధించిందో అంతటి విమర్శలను అందుకుంటుంది. ముఖ్యంగా లేడీస్ కి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. మహిళలను కించపరుస్తూ మేల్ డామినేషన్ ఎక్కువైందని విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ లేడి స్టార్ క్రిటిక్ అనుపమతో మొదలైన ఈ చర్చ అంతటా ప్రబలింది. అయినా 1000కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ఇప్పుడు ఓటీటీలోను విజృంభిస్తుంది యానిమల్. ఈ సందర్భంగా గృహలక్ష్మి ఫేమ్ కస్తూరీ శంకర్ ఈ సినిమాపై విరుచుకుపడింది. నిత్యం ఏదొక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండే కస్తూరి యానిమల్ ని గట్టిగా వేసుకుంది.

లాస్ట్ నైట్ ఈ మూవీ చూద్దామని స్టార్ట్ చేశా.. సగం కూడా కాలేదు.. అప్పటికే నాకే విసుగొచ్చింది.. అసలు ఈ సినిమాను థియేటర్లో జనాలు ఎలా చూశారు.. మూడున్నర గంటలు ఎలా ఉన్నారు.. ఇక ఆటో ఫ్లైయింగ్ ప్లేన్‌లో ఆ సీన్లు ఏంటి? ప్రేమలో పడటం ఏంటి? మాట్లాడుకునే టైంలోనే అలా అయిపోవడం ఏంటి?.. అసలు వాళ్లు ఎక్కడికి వెళ్లారు.. వామ్మో.. నన్ను తప్పుగా తీసుకోకండి.. సినిమాను టాప్ నాచ్‌లో తీశాడు.. కానీ ఆ స్థాయిని మనం అందుకోలేం.. అందులో చాలా ఉంది.. కానీ ఆ సినిమా నన్ను ఎంటర్టైన్ చేయలేదు.. విసుగు తెప్పించింది అంటూ కౌంటర్లు వేసింది. అయితే యానిమల్ మూవీ హిందీ, తెలుగు, కన్నడలో భారీ హిట్ కొట్టినా తమిళనాడులో మాత్రం డిజాస్టర్ అయింది. తమిళ ఫ్యాన్స్ కి ఈ మూవీ పెద్దగా ఎక్కలేదు. అందుకే ట్రోలర్స్ ఎక్కువగా తమిళనాడు నుండే ఈ సినిమాని విమర్శిస్తున్నారు. ఇక అధికంగా ఫెమినిస్టులు ఉండే తమిళనాడులో ఇలాంటివి సహజం అని లైట్ తీసుకోమంటుంది మూవీ టీమ్.

Latest News

More Articles