Sunday, May 12, 2024

దేశానికి అతిథులొస్తున్నారు..ఎవరిని ఎవరు ఆహ్వానించనున్నారో తెలుసా?

spot_img

దేశ రాజధాని ఢిల్లీ జీ 20 సమ్మిట్ కు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. సమ్మిట్ లో పాల్గొనే అథితుల రాక కూడా షురూ అయ్యింది. ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఢిల్లికి చేరుకోనున్నారు. జో బిడెన్ తో సహా ప్రపంచ దేశాధినేతలను ఎవరు ఆహ్వానిస్తున్నారో తెలుసుకుందాం.

18వ జీ20 శిఖరాగ్ర సమావేశం భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో సెప్టెంబర్ 8 నుండి 10 వరకు జరగనుంది. 80ల తర్వాత ప్రపంచంలోని 20కి పైగా దేశాలకు చెందిన ప్రముఖ నాయకులు ఒకే వేదికపై కలిసి రావడం ఇదే తొలిసారి. అందుకే ఢిల్లీని అంగరంగ వైభవంగా అలంకరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి అతిథుల రాక ప్రారంభం కానుంది. 20కి పైగా దేశాల అధినేతలు నేడు న్యూఢిల్లీ చేరుకోనున్నారు. వారికి స్వాగతం పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.

ఢిల్లీకి బయల్దేరిన బిడెన్:

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు అమెరికా నుంచి బయలుదేరారు. దీనికి సంబంధించి ANI ఓ వీడియోను ట్వీట్ చేసింది. ఇందులో బిడెన్ తన కాన్వాయ్‌తో కలిసి విమానంలో కూర్చున్నట్లు కనిపించాడు. ప్రపంచంలోని అగ్రగామి నాయకులకు స్వాగతం పలికేందుకు మోదీ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర మంత్రులందరినీ డ్యూటీలో పెట్టింది. ఇది కాకుండా, అతిథులందరికీ సౌకర్యం, స్వాగతం కోసం వివిధ మంత్రులకు బాధ్యతలు కూడా అప్పగించారు. జి20 సదస్సులో పాల్గొనేందుకు నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు మంగళవారం తొలిసారిగా ఢిల్లీ చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ స్వాగతం పలికారు.

ఏ మంత్రి ఏ దేశాధినేతకు స్వాగతం పలుకుతారో చూడండి.?
-UK ప్రధాన మంత్రి రిషి సునక్: అశ్విని చౌబే

-అమెరికా అధ్యక్షుడు జో బిడెన్: వీకే సింగ్

-ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్: అనుప్రియా పటేల్

-జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్: BL వర్మ

-చైనా ప్రధాని లీ కియాంగ్: వీకే సింగ్

-జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా: అశ్విని చౌబే

-దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సోక్ యోల్: రాజీవ్ చంద్రశేఖర్

-ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్: రాజీవ్ చంద్రశేఖర్

-బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా: నిత్యానంద్ రాయ్

-మారిషస్ పీఎం ప్రవీణ్ కుమార్ జుగ్నాథ్: శ్రీపాద్ యెషో నాయక్

-సింగపూర్ PM లీ హ్సీన్ లూంగ్: ఎల్ మురుగన్

-యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్: ప్రహ్లాద్ సింగ్ పటేల్

-స్పెయిన్ అధ్యక్షుడు: శంతను ఠాకూర్

-ఇటలీ ప్రధాని జార్జియా మెలోని: శోభా కరంద్లాజే

-బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా: దర్శన జర్దోష్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఈ సదస్సులో పాల్గొనడం లేదు. వారి స్థానంలో రష్యా, చైనా తమ ప్రతినిధులను పంపుతున్నారు. G20 సదస్సులో ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల నేతలైన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా హాజరవుతున్నారు.

 

Latest News

More Articles