Sunday, April 28, 2024

స్త్రీ, పురుషుల కలయిక లేకుండానే పిండం

spot_img

బిడ్డ పుట్టాలంటే ఆడ, మగ తప్పక కలవాల్సిందే. కానీ, ప్రస్తుత టెక్నాలజీతో కలయిక లేకుండానే బిడ్డల్ని కంటున్నారు. అందుకోసం ఐవీఎఫ్, ఐఏఎఫ్ లాంటి పద్ధతుల్ని వాడుతున్నారు. ఇంకాస్త టెక్నాలజీని ఉపయోగించి జీవకణంతో మానవపిండాన్ని సృష్టించారు. ఈ అద్భుతం ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం తప్పక కలవాల్సిందే. కానీ, ఇకపై వాటితో అవసరం లేకుండానే పిల్లలను పుట్టించవచ్చని నిరూపించారు. జీవకణంతో మానవ పిండాన్ని సృష్టించడమే కాకుండా.. దాన్ని మహిళ గర్భంలో కాకుండా ప్రయోగశాలలో సృష్టించటం విశేషం. రెహోవొత్‌లోని వీజ్‌మన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌కు చెందిన పరిశోధకుల బృందం ఈ విప్లవాత్మక ఆవిష్కరణ చేసింది. మనిషి మూలకణాన్ని ఉపయోగించి అచ్చం మానవ పిండాన్ని పోలిన ఆకారాన్ని వారు సృష్టించారు. ఈ పిండం ప్రయోగశాలలో 14 రోజులపాటు పెరిగింది. తల్లిగర్భంలో పిండం రూపుదాల్చే ప్రారంభ దశలో ఎలా ఉంటుందో ఈ కృత్రిమ పిండం కూడా అచ్చం అలాగే ఉన్నదని పరిశోధకులు తెలిపారు.

Latest News

More Articles