Sunday, May 19, 2024

వెంటిలేటర్ మీద ఉన్న బీజేపీని కాపాడుకోవడానికి మోడీ నానాపాట్లు పడుతున్నారు

spot_img

గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని ప్రధానమంత్రికి తెలంగాణ గడ్డపై మాట్లాడే అర్హ్వత లేదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిన్న నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి మోడీ చేసిన ప్రసంగం ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చే విధంగా ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఉండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన అసత్యపు ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. గత తొమ్మిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పైసా ఇవ్వని ప్రధానమంత్రికి తెలంగాణ గడ్డపై మాట్లాడే అర్హ్వత లేదు. విభజన హామీలను తుంగలో తొక్కిన ఘనుడు మోడీ. పార్లమెంట్ లోపల, పార్లమెంట్ బయట తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తూ పలుమార్లు ప్రధాన మంత్రి ప్రసంగించారు.

Read Also: బీజేపీ గెలవదు.. కాంగ్రెస్ లేవదు.. గెలిచేది కేసీఆర్ మాత్రమే

వెంటిలేటర్ పైన ఉన్న బీజేపీని కాపాడుకోవడానికి ప్రధానమంత్రి మోడీ.. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేశారు. అవినీతిపరులు నా పక్కన కూర్చోవడానికి బయపడుతారు అని మోడీ అనడం హాస్యాస్పదంగా ఉంది. ఈడీ, సీబీఐ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బీజేపీలో ఎందుకు చేర్చుకుంటున్నారు? కేటీఆర్‎ని ముఖ్యమంత్రి చేయాలి అంటే మోడీ ఆశీర్వదం అవసరం లేదు. అవినీతి చేస్తే ఎందుకు మాపై విచారణ చేయలేదు. కేవలం రాజకీయ లబ్ధికోసం తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదు. ప్రధానమంత్రి మోడీ ఒక నియంతలా ఆలోచిస్తున్నారు. కక్ష్యపురితంగా ప్రధాన మంత్రి వ్యవహరించడం కరెక్ట్ కాదు. కేసీఆర్ పై మాట్లాడే అర్హత ప్రధానమంత్రి మోడీకి అస్సలు లేదు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

Read Also: బీజేపీ లక్ష్మణ్ వచ్చి బీఆర్ఎస్‎కు మద్దతిస్తామన్నారు.. మేమే తిరస్కరించాం

Latest News

More Articles