Sunday, May 19, 2024

బీజేపీ గెలవదు.. కాంగ్రెస్ లేవదు.. గెలిచేది కేసీఆర్ మాత్రమే

spot_img

కోస్గి మునిసిపాలిటిలో టియుఎఫ్ఐడిసి నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నిర్మాణం పూర్తిచేసుకున్న 50 పడకల ఆస్పత్రిని మంత్రి మహేందర్ రెడ్డి, మండలి డిప్యూటి చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిలతో ప్రారంభించారు. అనంతరం జూనియర్ కాలేజి మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో పాల్గొని మంత్రి హరీష్ రావు మాట్లాడారు.

Read Also: మంత్రి కేటీఆర్‎పై మోడీ వ్యాఖ్యలు సరికావు.. దేశ ప్రజలంతా చూస్తున్నారు

‘కొడంగల్‎లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదని.. పట్నం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఆనాడు కొడంగల్‎లో ఒక్క ఆస్పత్రి కూడా లేదు. కానీ ఈ రోజు కోస్గిలో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించుకున్నాం. కొడంగల్‎లో 50 పడకల ఆస్పత్రి, మద్దూరులో 30 పడకల ఆస్పత్రిని గతంలోనే ప్రారంభించుకున్నాం. రేవంత్ రెడ్డిని అప్పుడు గెలపిస్తే కనీసం ఒక్క సర్కార్ దవాఖానాను కూడా తీసుకురాలేకపోయాడు. నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత కొడంగల్‎కు సీఎం కేసీఆర్ మూడు ఆస్పత్రులను మంజూరు చేశారు. మీరు వైద్యం కోసం ఎక్కడికి వెళ్లకూడదని ఇప్పుడు 50 పడకల ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చాం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంటింటికి మంచినీళ్లు వస్తున్నాయి. పాలమూరు ఎత్తిపోతలతో కృష్ణమ్మ నీళ్లు బిరబిరా వచ్చి నార్లాపూర్ రిజర్వాయర్ లో పడ్డాయి. నరేందర్ రెడ్డిని గెలిపిస్తే.. నల్లా తిప్పితే ఇంట్లో నీళ్లు ఎలా వస్తున్నాయో.. అలాగే పాలమూరు ఎత్తిపోతల నీళ్లు కూడా ఏడాది లోపు మీ పొలంలోకి వస్తాయి.

Read Also: ఏషియన్ గేమ్స్‎లో గత రికార్డును బద్దలుకొట్టిన భారత్

మాటలు కావాలా? పనులు కావాలా?
కొందరు మాటలు ఎక్కువ మాట్లాడతారు, పనులు తక్కువ చేస్తారు. మరికొందరేమో తక్కువ మాట్లాడి, చేతల్లో ఎక్కువ చేస్తారు. రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడితే.. నరేందర్ రెడ్డి చేతలు చేస్తాడు. కమ్మటి, తియ్యటి మాటలు కావాలంటే రేవంత్ రెడ్డి వైపు వెళ్లండి. కొడంగల్ రూపురేఖలు మారాలంటే మాత్రం నరేందర్ రెడ్డిని మళ్లీ దీవించండి. పాలమూరు ఎత్తిపోతల ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు నీరందించబోతున్నాం. ఈ టర్మ్‎లో మంచి నీళ్లు ఇచ్చాం. వచ్చే టర్మ్‎లో కాలువ నీళ్లు వస్తాయి. అలా అయితే వలసలు పోయే బాధ పోయి.. మన ఊర్లో, మన పొలంలో పనిచేసుకునే రోజులు వస్తాయి.

రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం
రైతులకు 24 గంటల కరెంట్ దండగ అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. గతంలో ఆయన గురువు చంద్రబాబు.. వ్యవసాయం దండగ అన్నాడు. ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మూడు గంటల కరెంట్ చాలనుకునేవాళ్లు కాంగ్రెస్‎కు ఓటేయండి.. 24 గంటల కరెంట్ కావాలనుకునేవాళ్లు బీఆర్ఎస్‎కు ఓటేయండి. గతంలో మనం వెళ్లకొడితే మల్కాజిగిరి పోయిండు. అక్కడ ఏ పని చేయలేదు, దాంతో ఓటమి భయం పట్టుకుంది. అందుకే మళ్లీ మన దగ్గరికి వస్తుండు. కాబట్టి జాగ్రత్తగా ఓటేయండి. కాంగ్రెసోళ్లు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. పక్కనున్న కర్నాటకలో అడగండి.. కళ్యాణ లక్ష్మి కింద రూ. లక్ష ఇస్తున్నారేమో. వితంతువు పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కర్నాటకలో కాంగ్రెస్ వాళ్లు ఇస్తున్నారేమో అడగండి. అక్కడ ఇచ్చేది కేవలం 600 మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం 4 వేలు ఇస్తామంటున్నారు. మరి ఇన్నేండ్లు ఎందుకు ఇయ్యలేదు? కర్నాటక, రాజస్థాన్, చత్తీస్ గడ్‎లో నాలుగు వేలు ఇచ్చి, ఆ తర్వాత ఇక్కడ ఇవ్వండి. మేం ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచుతూ వచ్చాం. కేసీఆర్ మాటంటే ఆ మాట మీద నిలబడతాడు. ఓట్ల కోసం బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు ఏవేవో చెబుతున్నారు. తెలంగాణలో ఆ పార్టీలకు చోటే లేదు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదు. గెలిచేది ఒక్క మన కేసీఆర్ మాత్రమే. ఏ సర్వే చూసినా కేసీఆర్, గులాబి జెండాకే పట్టం కడుతున్నారు. డబ్బులు పంచి గెలవాలని కొంతమంది చూస్తున్నారు. అటువంటి వారిని నమ్మొద్దు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం. అటువంటి వారి మాటలు నమ్మి ఆగం కావొద్దు.

Read Also: బీజేపీ లక్ష్మణ్ వచ్చి బీఆర్ఎస్‎కు మద్దతిస్తామన్నారు.. మేమే తిరస్కరించాం

కొత్త మ్యానిఫెస్టోలో మహిళలకు కొత్త పథకాలు
కొడంగల్ నియోజకవర్గంలో 46 తండాలు గ్రామ పంచాయతీలుగా మారాయంటే దానికి కారణం కేసీఆర్. ఈ విధంగా పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాల్సిన బాధ్యత మీది. మహిళల కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. కల్యాణ లక్ష్మి, గృహలక్ష్మి చెక్కులను వారి పేరు మీదనే ఇస్తున్నాం. త్వరలోనే మన మ్యానిఫేస్టో వస్తుంది. మా అక్కాచెల్లెళ్లను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడానికి కొత్త మ్యానిఫెస్టోలో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాబట్టి కొడంగల్ అభివృద్ధిపథంలో ముందుకెళ్లాలంటే నరేందర్ రెడ్డిని గెలిపించుకోవాల్సిందే’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Latest News

More Articles