Friday, May 17, 2024

అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ పార్లమెంట్ ఎన్నికల్లో రివర్స్ కావొచ్చు

spot_img

అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ పార్లమెంట్ ఎన్నికల్లో రివర్స్ కావొచ్చన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. పార్టీ అవకాశం ఇస్తే మా కొడుకు అమిత్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారన్నారు. మీడియా చిట్ చాట్ లో మాట్లాడి గుత్తా సుఖేందర్ రెడ్డి..నేను నారాజ్ గా లేను.. నా పదవి ఏమి పోతలేదు. నా పదవి కాలం ఇంకా 4 ఏండ్లు ఉంది. మూడు, నాలుగు రోజుల తర్వాత పోటీ పై అధిష్టానం క్లారిటీ ఇస్తుంది.గాలి వచ్చింది..పార్టీ ఓడింది..అభివృద్ధి చేసిన మంత్రులు కూడా ఓడిపోయారు. భువనగిరి లేదా నల్లగొండ సీటు లో ఏదైనా అమిత్ రెడ్డి పోటీ చేస్తారు. టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ లోకి వెళ్లను. ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి చేయాల్సిందేనన్నారు.

కేఆర్ఎంబీ కేంద్రం పరిధిలోకి వెళ్తే తెలంగాణ కు గొడ్డలి పెట్టు లాంటిదన్నారు గుత్తా సుఖేందర్ రెడ్డి. సాగు, తాగు నీళ్లకు ఇబ్బంది అవుతుందన్నారు. నల్లగొండలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో ఇబ్బంది అవుతుందని తెలిపారు. పాత అసెంబ్లీ బిల్డింగ్ లో మరమ్మతులు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీని, అభ్యర్థులను చూసి ప్రజలు ఓటు వేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న వేవ్ పార్లమెంట్ ఎన్నికల్లో రివర్స్ కావొచ్చన్నారు. ఎవరు ఏ పార్టీ లేకుండా చేయలేరు.. ఎవరైనా ఆ మాటలు అంటే అది అహంకారపు మాటలే అని అన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

ఇది కూడా చదవండి: చేతిలో టపాసులు పేలి.. యువకుడి చెయ్యి నుజ్జు నుజ్జు!

Latest News

More Articles