Friday, May 17, 2024

జ్ఞానవాపి మసీదు కింద హిందూ దేవాలయం అవశేషాలు..!!

spot_img

యూపీ వారణాసిలని జ్ఞానవాపి మసీదు సముదాయానికి సంబంధించి ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే రిపోర్టులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. జ్ఞానవాపి మసీదు కింద అతిపెద్ద దేవాలయం ఆనవాళ్లకు గుర్తించినట్లు ఏఎస్ఐ సర్వేలో వెల్లడైందని హిందూపక్షం న్యాయవాది విష్ణు శంకర్ వెల్లడించారు. హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ…ఆలయం కింది భాగంలో హిందూ దేవాలయం ఉందని ..విగ్రహాలను కూడా పురావస్తు శాఖ అధికారులు గుర్తించినట్లు చెప్పారు.

ఆలయం ఉన్నట్లు 32 ఆధారాలు లభ్యమయ్యాయి:
ASI నివేదిక ప్రకారం, జ్ఞానవాపిలో 32 పురాతన ఆలయ స్తంభాలను ఉపయోగించినట్లు విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నారు. ఇవి పురాతన ఆలయ భాగాలు. అలాగే, S-2 నేలమాళిగలో హిందూ దేవుళ్లు, దేవతల నిర్మాణాలు కనుగొనబడ్డాయి. సర్వే నివేదిక ప్రకారం, మసీదు కంటే ముందు ఇక్కడ ఆలయం ఉందని, 17వ శతాబ్దంలో ఆలయం కూల్చివేయబడింది. ASI దేవనాగరి, తెలుగు, కన్నడ శాసనాలను కనుగొన్నారు.

హిందూ దేవాలయం స్తంభాలతోనే ప్రస్తుత మసీదు నిర్మించారని పురావస్తు శాఖ అధికారుల సర్వేలో తేలిందని హిందూపక్షం న్యాయవాది చెప్పారు. మసీదు దక్షిణ భాగంలని గోడ, హిందూ ఆలయానికి చెందినదని..అనుమానాలు ఉన్నాయన్నారు. ఆలయానికి సంబంధించిన శిల్పాలను కాస్త చెక్కి మళ్లీ మసీదు నిర్మాణంలో ఉపయోగించారన్నారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి 34 కీలక శాసనధారాలు లభ్యమైనట్లు చెప్పారు. జనార్థన, రుద్ర, ఉమేశ్వర పేర్లతో ఈ శాసనాలు లభ్యమైనట్లు వెల్లడించారు. ఇవి దేవనాగరి, తెలుగు , కన్నడ భాషల్లో ఉన్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: 132 మందికి పద్మ అవార్డులు..మెగాస్టార్ చిరంజీవి, మాజీ రాష్ట్రపతి వెంకయ్యలకు పద్మ విభూషణ్

Latest News

More Articles