Sunday, May 19, 2024

13 మంది ఇజ్రాయెల్‌ బందీల విడుదల!

spot_img

ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కొనసాగుతోన్న భీకర యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక కాల్పుల విరమణకు కుదిరిన సంధి లో భాగంగా తమ దగ్గర ఉన్న 240 మంది బందీల్లో 13 మంది ఇజ్రాయెల్‌ జాతీయులను హమాస్‌ విడుదల చేసినట్లు తెలుస్తోంది. వారిని రెడ్‌క్రాస్‌కు అప్పగించినట్లు సమాచారం అందిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: వరల్డ్‌కప్‌ ట్రోఫీపై కాళ్లు పెట్టిన ఆస్ట్రేలియా ప్లేయర్ పై కేసు నమోదు

మరోవైపు.. తమ దేశానికి చెందిన 12 మంది బందీలను హమాస్‌ విడుదల చేసిందని థాయ్‌ ప్రధాని స్రెతా థావిసిన్‌ ప్రకటించారు. వారిని తీసుకొచ్చేందుకు రాయిబార బృందాలు బయల్దేరినట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు పాల్పడిన హమాస్‌ ఉగ్రవాదులు.. 200 మందికిపైగా పౌరులను బందీలుగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే.

Latest News

More Articles