Monday, May 6, 2024

రైతులకు శుభవార్త.. రైతుబంధు నగదు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

spot_img

హైదరాబాద్: రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. నవంబర్ 28 వరకే నగదు పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకి వెంటనే నగుదు బదిలీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు, మంత్రులకు ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. రైతుబంధు పథకం కింద తెలంగాణలో 71.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు

.

Latest News

More Articles