Sunday, May 19, 2024

ఐడీబీఐ బ్యాంకులో 2100 ఖాళీలకు రిక్రూట్ మెంట్…ఇలా అప్లయ్ చేసుకోండి…!!

spot_img

బ్యాంకు ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 2100 ఆఫీసర్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. పలు కేటగిరీల్లో జూనియర్ ఆఫీసర్ కేటగిరికి రిక్రూట్ మెంట్ జరుగుతుంది.

మొత్తం 2100 పోస్టుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ కోసం 800 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ సేల్స్ అండ్ ఆపరేషన్స్ ఈఎస్ఓ కోసం 13వందల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ నవంబర్ 22 నుంచి ప్రారంభం అయ్యింది. అప్లయ్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 6గా నిర్ణయించారు. అభ్యర్థులు బ్యాంకు వెబ్ సైట్ idbibank.inలో నిర్ణీత పత్రాలను అప్ లోడ్ చేసి ఫీజును జమ చేయడం ద్వారా ఆన్ లైన్ లో అప్లయ్ చేసుకోవచ్చు. జనరల్, OBC, EWDS కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 1000గా నిర్ణయించారు. SC, ST, PWD అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 200. డిసెంబర్ 30,31వ తేదీల్లో పరీక్షను నిర్వహిస్తారు.

ఈవిధంగా దరఖాస్తు చేసుకోవాలి:
ఐడీబీఐ రిక్రూట్ మెంట్ పరీక్ష కోసం అభ్యర్థులు ముందుగా ఐడీబీఐ బ్యాంకు అధికారిక సైట్ idbibank.inను సందర్శించి…దరఖాస్తు కోసం లింక్ పై క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ చేయాలి. తర్వాత వ్యక్తిగత, విద్యా, వ్రుత్తిపరమైన వివరాలను నమోదు చేయాలి. దీనితర్వాత ద్రువీకరణ పత్రాల స్కాన్ చేసి కాపీలను అప్ లోడ్ చేయాలి. ఇప్పుడు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. తర్వాత ఫామ్ ను సమర్పించాలి.

ఇది కూడా చదవండి: రైతులకు శుభవార్త.. రైతుబంధు నగదు పంపిణీకి ఈసీ గ్రీన్ సిగ్నల్

Latest News

More Articles