Monday, May 20, 2024

గుండెపోటుతో హనుమంతుని పాత్రధారి హరీష్ మృతి

spot_img

అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రాణ ప్రతిష్ట ఘ‌నంగా జ‌రిగింది. దేశ‌మంతా పండుగ జ‌రుపుకుంటున్న వేళ‌ హర్యానా  రాష్ట్రంలో విషాదం జరిగింది. హనుమంతుడిగా వేషధారణ చేసుకున్న వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన హర్యానాలోని భివానీలో జరిగింది. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న క్రమంలో  హర్యాయనాలోని భివానీలో ‘రాంలీల’ నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో భాగంగా హరీష్ అనే వ్యక్తి హనుమంతుని పాత్ర పోషించాడు.

ఈ ప్రదర్శనలో తన పాత్రను పోషిస్తూ హరీష్ ‘జై శ్రీరామ్’ అంటూ ఒక్కసారిగా గుండెపోటుతో కిందపడిపోయాడు. అయితే అందరూ అతను నాటకంలో భాగంగా అలా చేస్తున్నాడేమో అనుకున్నారు. కొద్ది సేపటికి ఆయన గుండెపోటుకు గురైనట్లు గుర్తించి.. ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే హరీష్ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

ఇది కూడా చదవండి: అయోధ్యలో కోహ్లీ డూప్ తో సెల్ఫీల కోసం ఎగబడిన జనం

Latest News

More Articles