Sunday, May 19, 2024

తేజ vs మహేష్.. మొదటివారం మొనగాడు ఎవరో తేలిపోయింది..!

spot_img

మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు విడుదలై నిన్నటికి సరిగ్గా ఒక వారం అవుతుంది. దీంతో ఈ రెండు సినిమాల ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పై వార్తలు వస్తున్నాయి. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రాల థియేట్రికల్ యుద్ధం మాములుగా లేదు. యూనానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న హనుమాన్ 7వ రోజు సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ ఏకంగా 5.57 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గుంటూరు కారం సినిమా 7వ రోజున 5.03 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

ఇక మొత్తం మొదటి వారం కలెక్షన్స్ ని పరిశీలిస్తే.. ఏడు రోజుల్లో గుంటూరు కారం మొత్తం రూ.173.74 కోట్లు వసూలు చేయగా.. హనుమాన్ రూ.135.83 కోట్లు వసూలు చేసింది. టోటల్ కలెక్షన్స్ లో మహేష్ బాబు ముందున్నాడు. అయితే చిన్న చిత్రంగా విడుదలై మహేష్ బాబుకే సవాల్ చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ చిత్రమే ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తుంది.

Latest News

More Articles