Friday, May 17, 2024

364 రోజులూ స‌ర్‌ప్ల‌స్‌లో ఉన్నాం

spot_img

కాంగ్రెస్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన శ్వేత‌ప‌త్రంపై రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ‌త ప్ర‌భుత్వంలో హ‌రీశ్‌రావు ఆర్థిక మంత్రి అయిన త‌ర్వాత పూర్తిగా స‌ర్‌ప్ల‌స్ దినాలు త‌గ్గాయ‌ని పేర్కొన్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. 2014-15లో 303 రోజులు మ‌న రాష్ట్రం స‌ర్‌ప్ల‌స్ ఉండేది.. హ‌రీశ్‌రావు ఆర్థిక మంత్రి అయిన త‌ర్వాత పూర్తిగా స‌ర్‌ప్ల‌స్ దినాలు త‌గ్గాయ‌ని రేవంత్ అన్నారు.

అది స‌రికాదు. సీఎంతో పాటు మంత్రులు వారికి అనుకూలంగా ఉన్న అంశాల‌ను తీసుకుంటున్నారు. పాజిటివ్‌గా ఉన్న అంశాల‌ను విస్మ‌రిస్తున్నారు. 2014-15లో 303 రోజులు ఉంటే, 2015-16లో 364 రోజులు స‌ర్‌ప్ల‌స్ ఉన్నాం. ఆ విష‌యాన్ని ఎందుకు చెప్ప‌రు. 2016-17లో 304 రోజులు, 2017-18లో 245 రోజులు, 2018-19లో 250 రోజులు స‌ర్‌ప్ల‌స్‌లో ఉన్నాం. ఆ త‌ర్వాత క‌రోనా మ‌హమ్మారి, పెద్ద నోట్ల ర‌ద్దు కార‌ణంగా ఆర్థిక మాంద్యం ఏర్ప‌డి స‌ర్ ప్ల‌స్ త‌గ్గింది. ఈ మాంద్యం ఒక్క తెలంగాణ‌లోనే కాదు.. ప్ర‌పంచం, దేశ వ్యాప్తంగా ఏర్ప‌డింది అని హ‌రీశ్‌రావు తెలిపారు.

Latest News

More Articles