Sunday, May 12, 2024

వామ్మో జేఎన్ 1…భారత్ లో పెరుగుతున్న కేసులు..మరో రెండు రాష్ట్రాల్లో కొత్త వేరియంట్..!!

spot_img

భారత్ లో కోవిడ్ 19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్ మనం దేశంలో వేగంగా వ్యాప్తిచెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 21 కోవిడ్ 19 సబ్ వేరియంట్ జెఎన్ 1 కేసులను గుర్తించారు. అయితే ఈ వైరస్ పట్ల భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నీతి అయోగ్ మెంబర్ వీకేపాల్ స్పష్టం చేశారు. గడిచిన 24గంటల్లో దేశంలో 614 కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మే 21 న కనుగొన్న కొత్త కేసుల్లో ఇవే ఎక్కువ.

కొత్త వేరియంట్ లో 20 కేసులు కూడా గోవా, కేరళ, మహారాష్ట్రల్లో గుర్తించారు. బుధవారం ఉదయం 8గంటలకు అప్ డేట్ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం భారత్ లో ఇప్పుడు 2311 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో మూడు కొత్త మరణాలు నమోదు అయ్యాయి. ఈ రోజు వరకు మొత్తం మరణాల సంఖ్య 5.33లక్షలకు కోవిడ్ కేసుల సంఖ్య 4.50కోట్లుకు చేరుకుంది.

గత 24 గంటల్లో 292 కొత్త కేసులతో, మొత్తం యాక్టివ్ కేసులలో కేరళ అత్యధికంగా నమోదు అయ్యాయి. తర్వాత తమిళనాడు (13 కొత్త కేసులు), మహారాష్ట్ర (11 కొత్త కేసులు), కర్ణాటక (9 కొత్త కేసులు), తెలంగా,ణ పుదుచ్చేరి (4 కొత్త కేసులు), ఢిల్లీలో మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం గుజరాత్ (3 కొత్త కేసులు), గోవా, పంజాబ్ (1 కొత్త కేసు) నమోదు అయ్యింది. కొత్త వేరియంట్ జెఎన్.1 యొక్క 20 కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో, ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) డేటా 20 కేసులు కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 దేశవ్యాప్తంగా కనుగొన్నారు. కొత్త కేసుల్లో 18 కేసులు గోవాలో ఒకటి కేరళ , ఒకటి మహారాష్ట్రలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: జాతీయ క్రీడా అవార్డులు: నిజామాబాద్‌ బాక్సర్‌ కు అర్జున

Latest News

More Articles