Saturday, May 11, 2024

లోకసభ ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించి బుద్ధి చెప్పాలి

spot_img

ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని, లోకసభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు. దౌల్తాబాద్‌లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ యువత సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పీ వెంకట్రామరెడ్డితో కలిసి పాల్గొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ చేసిందేమి లేదని.. ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయన్నారు. నల్లధనం తెచ్చి పేదల ఖాతాల్లో వేస్తామని మోసం చేశారని.. పేదలకు చేసిందేమీ లేదని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందనన్నారు.

మాయమాటల రఘునందన్ గురించి దుబ్బాక ప్రజలకు తెలుసునన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని.. రూ.2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతు భరోసా, వడ్లకు రూ.500 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. దౌల్తాబాద్‌కు వచ్చేటప్పుడు మిరుదొడ్డిలో మహిళా రైతులతో మాట్లాడానని, వడ్లు ఎవరూ కొనడం లేదని వాపోయారని తెలిపారు. మహాలక్ష్మి ద్వారా రూ.2500, నిరుద్యోగ భృతి కూడా మోసం చేశారన్నారన్నారు. జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌గా పనిచేసిన పీ వెంకట్రామరెడ్డి అందరికీ సుపరిచితుడేనని, ఇక్కడి అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారన్నారు. గతంలో దుబ్బాకలో అనాథలు రాధారాధికలకు అండగా ఉండి.. విద్యాబుద్ధులు చెప్పించి, పెళ్లి కూడా చేసిన మనసున్న వ్యక్తి అన్నారు.

ట్రస్టు ద్వారా సేవ చేయడానికి వచ్చిన ఆయనకు అండగా నిలవాలన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థికి ఘన విజయం అందిద్దామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దుబ్బాక అంటే మొదటి నుంచి ఉద్యమ నాయకులు కేసీఆర్‌, హరీశ్‌రావు అడుగులో అడుగై ముందుకు సాగడం జరిగిందన్నారు. జిల్లా నుంచే కేసీఆర్, హరీశ్‌రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థికి ఆదరణ కరువైందని, బీజేపీ అభ్యర్థికి ఆ పార్టీ వాళ్లే ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. మాయ మాటలు చెప్పే రఘునందన్‌ను రెండుసార్లు చిత్తు చిత్తుగా ఓడించడం జరిగిందన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు హరీశ్ రావు.

ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డి ది స్కీం ల పాలన కాదు స్కాం ల పాలన

Latest News

More Articles