Wednesday, May 1, 2024

సెల్ఫీకి యత్నించిన అభిమానికి బాలయ్య చేతి దెబ్బ

spot_img

టాలీవుడ్ సీనియర్  సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభిమానులపై చేయి చేసుకోవడం కొత్తేమీ కాదు. అభిమానులు కూడా బాలయ్య తమ పట్ల కోపం ప్రదర్శించడంపై ఎప్పుడూ ఫిర్యాదు చేసింది లేదు. ఇవాళ(శనివారం) బాలకృష్ణ కదిరి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు సత్యసాయి జిల్లా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చారు.

ఇది కూడా చదవండి: లోకసభ ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించి బుద్ధి చెప్పాలి

హెలికాప్టర్ దిగి ఇవతలికి వస్తున్న బాలయ్యను ఒక్కసారిగా అభిమానులు చుట్టుముట్టారు. ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా, బాలయ్య ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, ఒక్కటిచ్చుకున్నాడు. అతడిపై ఆగ్రహంగా చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

More Articles