Sunday, May 19, 2024

హ్యారీ పోటర్‌ నటుడు సర్‌ మైఖేల్‌ గాంబోన్‌ కన్నుమూత

spot_img

ప్రముఖ్ హాలీవుడ్‌ నటుడు, హ్యారీ పోటర్‌ ఫేమ్‌ సర్‌ మైఖేల్‌ గాంబోన్‌ (82) చనిపోయారు. న్యుమోనియాతో బాధపడుతున్న మైఖేల్‌ గాంబోన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను కుటుంబం ధ్రువీకరించింది. గాంబోన్‌ ‘హ్యారీ పోటర్‌’ సిరీస్‌లో ప్రొఫెసర్‌ ‘ఆల్బస్‌ డంబుల్‌ డోర్‌’ పాత్రను పోషించారు. ఐరిష్‌ నటుడి మరణవార్త వరల్డ్ వైడ్ గా సినీ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

మైఖేల్‌ గాంబోన్‌ 1940 అక్టోబర్‌ 19న ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో జన్మించిన ఆయన లండన్‌లో పెరిగారు. మొదట ఇంజినీర్‌గా శిక్షణ పొందారు. ఆ తర్వాత నాటకరంగంలో నుంచి సినిమాల్లోకి వచ్చారు. మూడు ఆలివర్‌ అవార్డులు, రెండు స్క్రీన్‌ యాక్టర్‌ అవార్డులతో పాటు నాలుగు బ్రిటీష్‌ అకాడమీ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ (BAFTA) అవార్డులను అందుకున్నారు. నాటకరంగంలో ఆయన చేసిన సేవకు క్వీన్ ఎలిజబెత్ II 1998లో ‘నైట్స్‌’ బిరుదును ప్రదానం చేశారు. 2015లో ఆయన సినిమాలకు వీడ్కోలు పలికారు. గాంబోన్‌ ఫెంటాస్టిక్‌ మిస్టర్‌ ఫాక్స్ లో ఫ్రెంచ్‌ డిటెక్టివ్‌ మైగ్రేట్‌గా, ది సింగింగ్‌ డిటెక్టివ్‌తో పాటు పలు చిత్రాల్లో కీలక ప్రాతలు పోషించి గుర్తింపు పొందారు.

Latest News

More Articles