Saturday, May 18, 2024

ఆ విటమిన్ లోపం ఉంటే నిద్రపట్టదట

spot_img

టైంకి నిద్రపట్టక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాదు..తగినంత నిద్ర పట్టకపోతే డిప్రషెన్స్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలున్నాయంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. దీనికి కారణం విటమిన్ బి12 లోపం. ఈ విటమిన్ లోపంతో నిద్ర పట్టక స్లీపింగ్ పిల్స్ కు  అలవాటు పడిన వారు కూడా ఉన్నారు. అయితే నిద్రలేమి సమస్యకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా శరీరంలో ఒక విటమిన్ లోపిస్తే నిద్రలేమి సమస్య వస్తుందని చెబుతున్నారు డాక్టర్లుఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం శరీరంలో విటమిన్ బి12 లోపం నిద్రలేమి సమస్యకు కారణం అవుతుంది

విటమిన్ బి12 కోసం బచ్చలికూర, బీట్రూట్, పుట్టగొడుగులు, బంగాళదుంపల వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఇక మాంసాహారం తినే వారైతే విటమిన్ బి12 కోసం ట్యూనా చేప, సాల్మన్ వంటి చేపలను ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో విటమిన్  బి12 పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా ఉడికించిన కోడిగుడ్లను తినడం వల్ల కూడా విటమిన్ బి 12 లభిస్తుంది. బీ 12 విటమిన్ తీసుకుంటే మీకు నిద్రలేమి సమస్యనుంచి బయటపడవచ్చంటున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్.

ఇది కూడా చదవండి: 50 రోజుల్లోనే అసంతృప్తి.. ఇదే రేవంత్ ఘ‌న‌త

Latest News

More Articles