Saturday, May 4, 2024

ఐదేళ్లలో గుర్తుకురాని ప్రజలు.. ఎన్నికలొస్తేనే గుర్తొస్తున్నారా?

spot_img

కరీంనగర్ జిల్లా: ఐదేళ్లలో గుర్తుకు రాని ఊర్లు బండికి ఇప్పుడు ఎన్నికలొస్తే గుర్తొస్తున్నాయా అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ ఐదేళ్లలో ఒక్క మంచి పని చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. చింతకుంటలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ఎస్టీ సెల్ ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తండాలను పంచాయతీలు చేసిన ఘనత గత బీఆర్ఎస్  ప్రభుత్వానిదే. పోడుభూములు సాగు చేసుకునే వారికి పట్టాలు ఇచ్చిన ఘనత గత బీఆర్ఎస్ సర్కారుదే. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వాళ్ళు బంజారాలు. బంజారాలు రాబోయే కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో తనకు ఒట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

దేశంలో బీజేపీ పార్టీ మత రాజకీయాలు చేస్తుందని, ఎన్నికలు వచ్చేటప్పుడు ఎదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు ఇచ్చిన ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు వేశారో లేదో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

Also Read.. తెలంగాణకు చేరిన జార్ఖండ్‌ రాజకీయం..!!

Latest News

More Articles