Friday, May 17, 2024

రేవంత్‎ను కాంగ్రెస్ నాయకులే బొందపెడతారు

spot_img

నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణంలోని వెంకటేశ్వర కన్వన్షన్‎లో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్‎లు రజినీ సాయి చంద్, వెంకటేశ్వర్ రెడ్డి, దేవరీ మల్లప్ప, తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడారు. ‘ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అమలు చేశాం. కార్యకర్తలకు అవకాశం రాలేదు, వాళ్ళు ఇబ్బంది పడిన మాట వాస్తవం. రూ. 7700 కోట్ల నిధులు నవంబర్‎లో రైతు బంధుకి విడుదల చేయాలని కేబినెట్ తీర్మానం చేశాం. రైతుబంధు నిధులు ఆపిందే కాంగ్రెస్ నాయకులు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ నిధులు ఇవ్వలేకపోయారు. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ అప్పుల ప్రస్తావన ముందు పెడుతుంది. హామీలు ఇచ్చే రోజు అమలు చేస్తమా? చేయలేమా? అని తెలియదా? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రైతులను చెప్పుతో కొట్టాలని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‎ను బొందపెడతా అంటున్నాడు. రేవంత్‎ను కాంగ్రెస్ నాయకులే బొంద పెట్టె రోజు వస్తుంది. కృష్ణ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి ఇస్తున్నారు. రైతుల పొట్ట కొట్టెందుకు చూస్తున్నారు. హామీలు అమలు చేయలేక కేంద్రంలో అధికారం వస్తే ఇస్తాం అంటూ కొత్త ముచ్చట చెప్తున్నారు. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధం అయ్యారు’ అని సత్యవతి అన్నారు.

Read Also: సీఎం రేవంత్‎కు కేటీఆర్ బహిరంగ లేఖ

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం అడ్డుకోలేక పోయాం. అభివృద్ధి పనులు చర్చకు రాలేదు. బీఆర్ఎస్ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పలేకపోయాం. కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దు.. ధైర్యంగా ఉండాలి. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తూ ముందుకు వెళ్తాం. పదేళ్లు ప్రజల కోసం కస్టపడి పని చేశాం.

Latest News

More Articles