Thursday, May 2, 2024

బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటీఆర్.. ఇంటికి వెళ్లి ఆర్థికసాయం అందజేత

spot_img

హైదరాబాద్: మాజీమంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్న బాలుడి చికిత్సకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే.. ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. ప్రదీప్ చికిత్స కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు.  ఆర్థిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు. కానీ, దురదృష్టవశాత్తు ఆపరేషన్ సక్సెస్ కాకపోవడంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.

Also Read.. సీఎం రేవంత్‎కు కేటీఆర్ బహిరంగ లేఖ

మరోసారి చికిత్స కోసం రూ.7 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పడంతో  ప్రదీప్ కుటుంబం అవేదనకు గురయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి మంత్రి మల్లారెడ్డి.. అపరేషన్ కు అవసరం అయిన రూ.6లక్షల సహాయాన్ని అందజేశారు. అయితే, నిరుపేద కుటుంబం కావడంతో మిగిలిన లక్ష రూపాయలు కూడా జమ చేయడం కష్టంగా మారింది. బీఆర్ఎస్ స్థానిక కౌన్సిలర్ ఆంజనేయులు ఈ విషయాన్ని కేటీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకుపోయారు.

Also Read.. ఐదేళ్లలో గుర్తుకురాని ప్రజలు.. ఎన్నికలొస్తేనే గుర్తొస్తున్నారా?

దీంతో శక్రవారం మేడ్చల్ నియోజకవర్గం కృతజ్ఞతా సభలో పాల్గొన్న కేటీఆర్ సభ ముగిసిన తరువాత మల్లారెడ్డితో కలిసి ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీలోని ప్రదీప్ ఇంటికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. తాను అండగా ఉంటానని భరోసా కల్పించి.. ఆ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు. తమ కుమారుడి ఆపరేషన్ కు సాయం చేసిన కేటీఆర్, మల్లారెడ్డి లకు ప్రదీప్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read.. ప్రాజెక్ట్ లు అప్ప‌గింత‌పై బీఆర్ఎస్ ఎంపీలు నిర‌స‌న

Latest News

More Articles