Sunday, May 12, 2024

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ?

spot_img

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నేడు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈడీ కస్టడీ కూడా మంగళవారంతో ముగియనుండటంతో కవితను కోర్టుకు తరలించి స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జీ కావేరి బవేజా ఎదుట హాజరుపరచనున్నారు. బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే కవిత గత పదిరోజులుగా ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

అయితే కవితకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత తరపున వాదనలు బలంగా వినిపించనున్నారు. ఎన్నికళ వేళ వరుసగా జరుగుతున్న అరెస్టులపై కవిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కక్షసాధింపు ఉందంటూ ఆమె ఆరోపించారు. ఈ అంశాలను ఆమె తరపు న్యాయవాదులు ప్రస్తావిస్తూ చట్టంలోని కొన్ని సెక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేయనున్నట్లు తెలిపింది. ఇరుపక్షల వాదనల అనంతరం కోర్టు కవిత బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒక వేళ బెయిల్ మంజూరు చేయకుండా కస్టడీ పొడిగిస్తే మళ్లీ ఈడీ కార్యాలయానికి లేని పక్షంలో జ్యూడీషియల్ రిమాండ్ లో భాగంగా తిహార్ జైలుకు పంపించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: స్టేడియంలో కొట్టుకున్న రోహిత్, హార్థిక్ ఫ్యాన్స్..!

Latest News

More Articles