Sunday, April 28, 2024

కొత్త రేషన్ కార్డులపై కీలక అప్‌డేట్..!

spot_img

కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక అప్ డేట్ వచ్చిది. ఇప్పటికేచాలా మంది కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్త ఓ ఆర్బాటంగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించినా ఇప్పటివరకు మాత్రం వాటిని జారీ చేయలేదు. ఈక్రమంలో ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త అంశం తెరపైకి వచ్చింది. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అనేది ఇంకా ప్రశ్నాగానే ఉంది. అయితే కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ అయ్యే ఛాన్స్ ఉందో ఓసారి చూద్దాం.

ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఫ్రీ కరెంట్, రూ. 500కే గ్యాస్ సిలిండర్ వంటి స్కీంలకు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంతో చాలా మంది అర్హత కోల్పోతున్నారు. 3ఏండ్లుగా వినియోగాన్ని పరిగణలోనికి తీసుకుని దాని యావరేజ్ ఆధారంగా ఏడాదికి సిలిండర్స్ కేటాయిస్తారు. కొత్తగా అమల్లోకి రానున్న ఇతర పథకాలకు కూడా రేషన్ కార్డు ఉండాలి. ఇందిరమ్మ ఇళ్ళకు కూడా రేషన్ కార్డు ఉండాలి. ఇలా చాలా వాటికి రేషన్ కార్డు కావాలి. అందుకే చాలా మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లాలో ఇప్పటికే 55వేలకు పైగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి.ప్రస్తుతం లోకసభ ఎన్నికలకు సంబంధించిన కోడ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాతే కొత్త రేషన్ కార్డుల జారీ ఉండే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ?

Latest News

More Articles