Wednesday, May 1, 2024

స్టేడియంలో కొట్టుకున్న రోహిత్, హార్థిక్ ఫ్యాన్స్..!

spot_img

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్‌కు ఇప్పటికే శుభారంభం లభించింది. సూపర్ సండే రెండో మ్యాచ్‌లో ఆతిథ్య గుజరాత్ జట్టు 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఉత్కంఠభరితంగా ప్రారంభించింది. ఇదే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన రోహిత్ శర్మ అభిమానులు, హార్దిక్ పాండ్యా అభిమానుల మధ్య స్టేడియంలో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అహ్మదాబాద్ లో నరేంద్ర మోదీ స్టేడియం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ముంబై ఇండియన్స్ జట్టును 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మ.. ఈసారి ఆటగాడిగా మాత్రమే బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను తొలగించి, హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ చేసినప్పటి నుండి, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ రెండుగా విడిపోయారు. హిట్ మ్యాన్ ను కెప్టెన్ గా తొలగించడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీపై అభిమానులు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇప్పుడు ఆ ఆగ్రహం మరో స్థాయికి చేరడంతో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా స్టేడియంలో ఇరువురు ఆటగాళ్ల అభిమానులు గొడవకు దిగారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 45 పరుగులు చేసి గుజరాత్ జట్టును ఆదుకున్నాడు. పోటాపోటీ లక్ష్యాన్ని ఛేదించిన హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో ఉత్కంఠ ఓటమిని చవిచూసింది. చివరిసారిగా 2012లో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. ఆ తర్వాత ప్రతి ఏడాది టోర్నీలో ముంబై తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది.

ఇది కూడా చదవండి: కల్కీ తాజా అప్ డేట్..కమల్ హాసన్ ఇలా షాకిచ్చాడేంటీ.!

Latest News

More Articles