Sunday, May 19, 2024

హెచ్చరిక.. జీన్స్, లెగ్గింగ్స్ వేసుకోవద్దు

spot_img

ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్, మేలో నమోదయ్యే ఉష్ణోగ్రతలు మార్చిలోనే నమోదు అవుతున్నాయి. భగభగ మండుతున్న ఎండలకు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం 9అవ్వకముందే ఎండ దంచికొడుతోంది. రానున్న రోజుల్లో వేడి పెరిగే అవకాశం ఉన్నందున జీన్స్, లెగ్గింగ్స్ వంటి దుస్తువులను ధరించకూడదని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా ఒకటి రెండు చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలతోపాటు ఉత్తరాదిన కూడా ఈనెల 15వ తేదీ వరకు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. అలాగే పలు చోట్ల గరిష్ట ఉష్ణోగ్రత 11వ తేదీ వరకు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

అధిక ఉష్ణోగ్రత, అధిక తేమ ఉన్నప్పుడు అసౌకర్యం ఏర్పడుతుందని కూడా పేర్కొన్నారు. రానున్న 48 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 34 నుంచి 35 డిగ్రీల సెల్సియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 25 నుంచి 26 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉండే అవకాశం ఉంది.వేసవి తాపం పెరిగిపోవడంతో ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల మధ్య బయటికి వెళ్లకుండా, కృత్రిమ శీతల పానీయాలు తాగకూడదని ప్రజారోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.ఎండకు వెళ్లే వారికి గుండెపోటు, పక్షవాతం వస్తాయని హెచ్చరించింది.

అధిక శరీర ఉష్ణోగ్రత కారణంగా స్పృహతప్పి, గందరగోళానికి గురైతే వెంటనే బట్టలపై చల్లటి నీళ్లు పోసుకుని 108, 104 నంబర్లలో వైద్యులను సంప్రదించవచ్చని ప్రజారోగ్య శాఖ సూచించింది. అలాగే, వేసవిలో ప్రజలకు చేయవలసినవి, చేయకూడని వాటిపై మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రయాణాల్లో తాగునీరు తీసుకెళ్లాలని, అవసరమైనన్ని నీళ్లు తాగాలని, కృత్రిమ శీతల పానీయాలకు దూరంగా ఉండాలని, నీళ్లు, మజ్జిగ, పళ్లరసాలు తాగాలని సూచించారు. సన్నని వదులుగా కాటన్ బట్టలు ధరించడం, జీన్స్, లెగ్గింగ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిదని తెలిపింది.

ఇది కూడా చదవండి : కేవలం రూ.6,999..ఇన్ఫిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్.!

Latest News

More Articles