Monday, June 24, 2024

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్..ఏడుగురు నక్సల్స్‌ మృతి.!

spot_img

దండకారణంలో కాల్పుల మోత కొనసాగుతోంది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7గురు మావోయిస్టులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దుల్లో గురువారం జరిగింది. నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం..నారాయణ్ పూర్ జిల్లా అబూజ్ మడ్ పరిధిలోని ఓర్చా అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందింది. దీంతో నారాయణ్ పూర్, బీజాపూర్ , దంతేవాడ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్ టీఎఫ్, ఐటీబీపీ బస్తర్ ఫైటర్స్ భద్రతా దళాలు కూబింగ్ చేపట్టాయి.

ఈ క్రమంలోనే మావోలు భద్రతాదళాలపైకి కాల్పులు జరపడంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. సుమారు 60 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు తెలుసుకున్న జవాన్లు పరిసరాలను వ్యూహాత్మకంగా చుట్టుముట్టాయి. మావోలు వారి ధాటికి తట్టుకోలేక కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గం మీదుగా పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి ఏడుగురు మావోల డెడ్ బాడీలను ఏడు తొపాకులు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులకు గాయాలైనట్లు, వారిని గుర్తించే పనిలో ఉన్నట్లు ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎదురుకాల్పుల్లో 112మంది మావోయిస్టులు మరణించారు.

ఇది కూడా చదవండి: రేపటి నుంచి రోహిణి కార్తె షురూ..రోకల్లు పగిలే ఎండలు తప్పవా?

Latest News

More Articles