Monday, May 20, 2024

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన.. అత్యవసర నెంబర్లు ఇవే

spot_img

హైదరాబాద్‌: నగరంలో పలుచోట్ల భారీ వర్షం దంచికొడుతోంది. మలక్‌పేట, ముసారాంబాగ్‌, దిల్‌సుఖ్‌ నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, ఎల్బీనగర్‌, నాగోల్‌, ఉప్పల్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది.

Also Read.. అభిమాని కోసం ఆటో నడిపిన మంత్రి జగదీష్ రెడ్డి

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని మేయర్ సూచించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే.. జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌  కోసం 040-21111111, 90000113667 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

Latest News

More Articles