Saturday, May 18, 2024

తెలంగాణలో ఐదు ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షం

spot_img

వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే దీనికి కారణమని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్‌, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.

Latest News

More Articles