Friday, May 3, 2024

హైదరాబాద్ లో ఉరుములతో కూడిన భారీ వర్షం.!

spot_img

వడగాలులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరివుతున్న నగర వాసులకు కాస్త ఊరట లభించింది. నగరంలోని పలుచోట్లు ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. రాజేంద్రనగర్, తుర్కయాంజల్, కొత్తపేట, సరూర్ నగర్, నాగోల్, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్, శంషాబాద్, ఆదిబట్ల, చార్మినార్, నాంపల్లి, మలక్ పేట్, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం, కాచిగూడలో వర్షం కురుస్తుంది. కాచిగూడ, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, అశోక్‌నగర్‌, బాగ్లింగంపల్లి, రాంనగర్‌, అడిక్‌మెట్‌, ఖైరతాబాద్‌, లక్టీకపూల్‌, తార్నాక, ఓయూ క్యాంపస్‌, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ఉప్పల్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, లంగర్‌హౌస్‌, కార్వాన్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, మాదాపూర్‌, బడంగ్‌పేట, జల్‌పల్లిలో వర్ఫం పడుతోంది. దీంతో ఉదయం నుంచే నగరమంతా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో చల్లని గాలులు వీస్తుండటంతో నగర ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

సూర్యుడి భగభగలతో నిప్పులకొలిమిలా మారిన రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వడగాలులు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాలలో 45.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కూడా కనిపింది. వడదెబ్బతో శుక్రవారం రోజు ఐదుగురు మరణించారు.

ఇది కూడా చదవండి: లిక్కర్ స్కాంలో నేడు మనీష్ సిసోడియాకు రిలీఫ్ దక్కేనా?

Latest News

More Articles